HMDA Commercial Plots

HMDA Commercial Plots

హైదరాబాద్ లో మరో ఏరోస్పేస్ కంపని

20.8.2017


ఆదిబట్ల సమీపంలో నాదర్గుల్ లో న్యూకాన్ ఏరోస్పేస్ కంపని ని శనివారం (19.08.2017) మంత్రి కే టీ ఆర్ ప్రారంభించారు. ఇందులో రక్షణ, అంతరిక్ష ఉత్పత్తుల విడి భాగాలు తయారుచేస్తారు. 5 ఎకరాల విస్తీర్ణంలో, రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న ఈ సంస్థ లో 600  మందికి ఉపాది కల్పించనున్నారు. బీ డి ఎల్ లో తయారు చేస్తున్న ఆకాష్ క్షిపణికి సంబందించిన కొన్ని విడి బాగాలు "న్యూకాన్ ఏరోస్పేస్" తయారుచేస్తూ ఉన్నది. 

ఫోటో సోర్సు : ఈనాడు 
  
   ఐటి, పరిశ్రమల మంత్రి కే టీ ఆర్ మాట్లాడుతూ హైదరాబాద్  ఏరోస్పేస్ హబ్ గా మారిందన్నారు. త్వరలో హైదరాబాద్ లో మరో ఏరోస్పేస్ ఎస్ ఈ జెడ్ ను ప్రారంభిస్తామన్నారు. ఏరోస్పేస్ యునివర్సిటి ఏర్పాటు కు   క్రాస్ ఫీల్డ్ యునివర్సిటి లండన్ వారితో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. అంతే కాదు త్వరలో ఏరోస్పేస్ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించనున్నట్లు చెప్పారు.          

   ఆదిబట్ల లో ఇదివరకే ఉన్న ఐటి ,ఏరోస్పేస్  కంపనీల సరసన న్యూకాన్ ఏరోస్పేస్ మరింత ఉపాదికి, అభివృద్ధికి కారకం అవుతుంది.